సికింద్రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు ఎంపీ ఈటల రాజేందర్. సికింద్రాబాద్ లోని క్లాసిక్ గార్డెన్ లో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన విజయ సంకల్ప సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా కమలం విజయం సాధిస్తూ వస్తుందని చెప్పారు. ప్రస్తుతం బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని , దీనిని మనం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతం కోసం ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు ఈటల రాజేందర్. అన్ని వర్గాల వారు పార్టీలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి అభయ్ పాటిల్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్, బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు , గోడం నగేష్ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్ , కాటిపల్లి వెంకట రమణారెడ్డి, బిజెపి రాష్ట్ర వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
















