అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలనంగా మారారు. దీనికి కారణం ఆయన తాజాగా దావోస్ పర్యటన ముగించుకుని ఇండియాకు వచ్చిన సందర్భంగా దేశంలో పేరు పొందిన న్యూస్ ఛానల్ ఎన్డీటీవీతో చిట్ చాట్ చేశారు. భారత దేశంలో ఏ రాష్ట్రానికి రానన్ని పెట్టుబడులు ఏపీకి వచ్చాయని చెప్పారు. అంతే కాదు ఇది తను చేసిన కృషి వల్లనే సాధ్యమైందన్నారు. ఇదే క్రమంలో పలుమార్లు యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన విస్తు పోయేలా సమాధానం ఇచ్చారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటి వరకు తాను ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలోనే కాదు ఏకంగా 23 కోట్లకు పైగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని చెప్పారు. దీనిపై అవాక్కయ్యారు మరోసారి ఆయన ఇదే ప్రశ్నను అడిగే ప్రయత్నం చేశారు రాహుల్ కన్వల్.
అయినా తిరిగి చంద్రబాబు నాయుడు ఇదే సమాధానం ఇచ్చారు. అవును 23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఇదే సమయంలో 23 కోట్ల ఉద్యోగాలను కల్పించడం జరిగిందని చెప్పారు. దీంతో దేశంలో ఇంకెక్కడా నిరుద్యోగం అనేది ఉండదని, అన్ని కోట్ల జాబ్స్ ఎక్కడ ఇచ్చారో చెప్పాలంటూ నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఏపీ సర్కార్ ను, సీఎంను నిలదీస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వైరల్ గా మారారు. చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ. ఇది బాబుకు మొదటి నుండి అలవాటేనని పేర్కొంటున్నారు మరికొందరు. మొత్తంగా బాబు నోరు పారేసు కోవడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది.

















