అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం : చంద్ర‌బాబు

31న వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తాం

hellotelugu-APCM

అమరావతి : వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాద‌ని అనుకున్న వారికి ఆచ‌ర‌ణ‌లో పూర్తి చేసి చూపించామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కు అందించారు . శ‌నివారం సీఎం మాట్లాడారు. ఈ నెల 31 తేదీన వెలిగొండ ప్రాజెక్టు తొలిదశను ప్రారంభిస్తాం అన్నారు. అసాధ్యమనుకున్న 30 ఏళ్ల వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యమని చేసి చూపించాం అని పేర్కొన్నారు. 1996లో శిలాఫలకం వేసి 2026లో ప్రాజెక్టును ప్రారంభించు కుంటున్నాం అని తెలిపారు. సీఎంగా 1995లో ఆ ప్రాంతానికి వెళ్లినప్పుడు రైతులు సాగు, తాగునీరు ఇవ్వాలని కోరారని గుర్తు చేశారు. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఇప్పుడు ప్రారంభించేలా రెండేళ్లలో రూ.2,250 కోట్లు ఖర్చు చేశాం అన్నారు. నాడు ఎన్టీఆర్ వేసిన వివిధ ప్రాజెక్టుల ఫౌండేషన్లను పూర్తి చేసి ప్రారంభించటం నా అదృష్టం అని పేర్కొన్నారు సీఎం. ఈ ఏడాది ఎల్ నినో కారణంగా 50 శాతం లోటు వర్షపాతం ఉంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు నీళ్లు రాలేదు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు ఇవ్వాలని సంకల్పించుకున్నాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. 2019లో మేం అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే పూర్తి చేసేవాళ్లం. అయినా గత పాలకులు చేసిన డ్రామాలతో ప్రాజెక్టు సాధ్యం కాలేదన్నారు. పోలవరం పూర్తి చేసి కృష్ణాడెల్టాకు, శ్రీశైలంలో నీరు పొదుపు చేసి ప్రకాశం నెల్లూరు, కడప, రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వొచ్చు అన్నారు. గంగా-గోదావరి- కావేరి అనుసంధానించాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదించానని తెలిపారు సీఎం. ఐదు నదులను అనుసంధానిస్తే నాలుగు రాష్ట్రాల్లో సమస్యలు తీరిపోతాయని స్ప‌ష్టం చేశారు. దేశానికే నీటి సమస్య పరిష్కారమై నీటి భద్రత వస్తుందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు జరిగేలా ప్రయత్నం చేస్తున్నాం అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. మార్కాపురం జిల్లాలో జల్ జీవన్ మిషన్ ద్వారా కుళాయి నీరు ప్రతీ ఇంటికి ఇస్తాం. పనులు కూడా వేగంగా జరుగుతున్నాయన్నారు.

Exit mobile version