అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఆయన మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చాక ప్రజల సమస్యలను పక్కన పెట్టారని ఆరోపించారు. తండ్రీ కొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు విదేశీ పర్యటనలు చేయడం, ప్రచారం చేసుకోవడం తప్పితే రాష్ట్రానికి మంచి పని చేసింది ఏమీ లేదన్నారు పేర్ని నాని. ఇలాంటి వాళ్లనా తాము ఎన్నుకున్నది అంటూ లోలోపట జనం మధన పడుతున్నారని అన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. వ్యక్తిగత , రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం అలవాటుగా మారిందన్నారు.
రెడ్‌బుక్ పేరుతో మంత్రి లోకేశ్ చేస్తున్న బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్యాయంగా జైల్లో ఉంచడంతో ప్రజల్లో జోగి రమేశ్‌కు క్రేజ్ పెరిగిందన్నారు. రెడ్‌బుక్‌ను తన కుక్క కూడా లెక్క చేయదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు రాజకీయం చేశారని ఆరోపించారు. చంద్రబాబు తప్పును దేవుడు కూడా క్షమించడని అన్నారు. తండ్రీ కొడుకుల అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు అంబటి రాంబాబు.

















