Rahul Gandhi : బీహార్ : రాష్ట్రంలో ఓట్ల చోరీ జరిగిందని మరోసారి సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ రాష్ట్రంలోని పూర్ణియాలో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి జేబు సంస్థగా మారిందంటూ మండిపడ్డారు. ఓట్ల చోరీకి సంబంధించి తాను ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించారు. మరోసారి మోసం చేసేందుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ (Rahul Gandhi).
Rahul Gandhi Slams Bihar Govt
దీనిని ప్రజలు, యువత గుర్తించాలని హితవు పలికారు. లేక పోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆయన ప్రధానంగా మరోసారి విరుచుకు పడ్డారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై. బీజేపీ , ఎన్డీయే కూటమి గెలుపొందేందుకు పరోక్షంగా సహకరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. పోలింగ్ జరిగే సమయంలో యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. నరేంద్ర మోదీ, నితీష్ కుమార్ లు అంబానీ, అదానీల కోసం పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వారు మీ భవిష్యత్తును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వారు ఓట్లను దొంగిలిస్తున్నారని చెప్పారు.
Also Read : KTR Fired Congress Govt : మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
