Visharadhan Maharaj Shocking Comments : నవీన్ యాదవ్ శరీరం బీసీది మెద‌డు రేవంత్ రెడ్డిది

డాక్ట‌ర్ విశార‌ద‌న్ మ‌హారాజ్ సంచ‌ల‌న కామెంట్స్

Hello Telugu - Visharadhan Maharaj Shocking Comments

Hello Telugu - Visharadhan Maharaj Shocking Comments

Visharadhan Maharaj : హైద‌రాబాద్ : డీఎస్పీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు డాక్ట‌ర్ విశార‌ద‌న్ మ‌హారాజ్ (Visharadhan Maharaj) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై ఆయ‌న స్పందించారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున బ‌రిలో నిలిచిన న‌వీన్ యాద‌వ్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న శ‌రీరం బీసీద‌ని, కానీ మెద‌డు మాత్రం ప‌క్కా సీఎం రేవంత్ రెడ్డిదంటూ కామెంట్స్ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ తో కూడిన జేఏసీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే దానిపై తాము ఎలాంటి కామెంట్ చేయ‌ద‌ల్చు కోలేద‌న్నారు. అది వారి వారి వ్య‌క్తిగ‌త ఎజెండా త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. అయితే త‌మ పార్టీ త‌ర‌పున ఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌న్నారు. ఒక‌వేళ వ్య‌క్తులు కానీ లేదా సంస్థ‌లు కానీ ఇవ్వాల‌ని అనుకుంటే అది వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయం కింద‌కు వస్తుంద‌న్నారు.

Visharadhan Maharaj Slams Naveen Yadav

ఈ ఉప ఎన్నిక‌లు రాష్ట్ర పాల‌న‌కు రెఫ‌రెండం అనేది కానే కాద‌న్నారు. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా వైఫ‌ల్యం చెందాడ‌ని ఆరోపించారు డాక్ట‌ర్ విశార‌ద‌న్ మ‌హారాజ్. త‌ను గెలిచినా ఓడిచినా బీసీల‌కు , ఈ అణగారిన వ‌ర్గాల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌ద‌న్నారు. న్యాయ‌ప‌ర‌మైన హ‌క్కుల కోసం పోరాడాల్సిన వాళ్లు కొన్ని పార్టీల‌కు వ‌త్తాసు ప‌ల‌క‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలాగైతే ఉద్య‌మం ఎలా ముందుకు సాగుతుంద‌ని ప్ర‌శ్నించారు. కొన్నేళ్లుగా ఒకే సామాజిక వ‌ర్గం ఏలుతూ వ‌చ్చింద‌న్నారు. ఇవాళ ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న చెందారు డాక్ట‌ర్ విశార‌ద‌న్ మ‌హారాజ్.

Also Read : Mahesh Bigala Shocking Comments : జూబ్లీహిల్స్‌లో ఎగిరేది గులాబీ జెండానే

Exit mobile version