Mahesh Bigala Shocking Comments : జూబ్లీహిల్స్‌లో ఎగిరేది గులాబీ జెండానే

బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల

Hello Telugu - Mahesh Bigala Shocking Comments

Hello Telugu - Mahesh Bigala Shocking Comments

Mahesh Bigala : హైద‌రాబాద్ : తెలంగాణ స‌మాజం మొత్తం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ మ‌రోస‌రి జ‌య‌కేత‌నం ఎగుర వేయ‌డం ఖాయ‌మ‌ని అన్నారు బీఆర్ఎస్ బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ కోఆర్డినేటర్‌ మహేష్ బిగాల (Mahesh Bigala). గత 20 రోజులుగా త‌మ‌ ఎన్నారైలు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో నిల‌బ‌డిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ విజయానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి అన్ని చానెల్‌లలో వారు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంఘాల దృష్టిని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల దిశగా మళ్లించార‌ని పేర్కొన్నారు మ‌హేష్ బిగాల‌.

Mahesh Bigala Comments

ప్రతి రోజు డిజిటల్‌ పోస్టులు, వీడియోలు, చర్చలు, లైవ్‌ సెషన్‌లు నిర్వహిస్తూ ప్రజల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి స్ఫూర్తిని విస్తరిస్తున్నారని చెప్పారు. ఇకపోతే, సాంకేతికతతో పాటు ప్రత్యక్షంగా జన సమక్షంలో కూడా వీరి కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఎన్నారైలలో కొంతమంది ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చి జూబ్లీహిల్స్‌లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ ప్రతి గల్లీ, ప్రతి ఇంటికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలవాల్సిన అవసరాన్ని తెలియ జేస్తున్నారని వెల్ల‌డించారు. ప్రజలతో సంభాషిస్తూ అభిప్రాయాలు తెలుసుకుంటూ, అభ్యర్థి సేవా విలువలను వివరించడంలో వారంతా చురుగ్గా పాల్గొంటున్న‌ట్లు తెలిపారు.

దేశ విదేశాల్లో ఉన్న మరెన్నో ఎన్నారై సభ్యులు వీడియో సందేశాలు, ఆన్‌లైన్‌ మీటింగులు, సంఘ సమావేశాల ద్వారా తమ సంఘటిత మద్దతును తెలుపుతున్నారని చెప్పారు. ఈ ముప్పై దేశాల వ్యాప్తంగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారం, నలుమూలలా విస్తరించిన ఎన్నారైల ఐక్య కృషి జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయ‌మైంద‌ని స్ప‌ష్టం చేశారు మ‌హేష్ బిగాల‌.

Also Read : Rahul Gandhi Shocking Comments : బీహార్ లో ఓట్ల చోరీ నిజం : రాహుల్ గాంధీ

Exit mobile version