విశాఖ ఐటీ, జీసీసీ కేంద్రంగా మారుతోంది

ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కామెంట్స్

hellotelugu-NaraLokesh

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీని ఐటీ హ‌బ్ గా మార్చే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని చెప్పారు రాష్ట్ర విద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌. విశాఖ- కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు మంత్రి, ఉన్న‌తాధికారులు . ఈ సంద‌ర్బంగా నారా లోకేష్ ప్ర‌సంగించారు. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగు పెట్టడం చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొన్నారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మారతాయన్నారు. 2025 లో దావోస్ కలిసి కాగ్నిజెంట్ ను విశాఖకు ఆహ్వానించామ‌ని అన్నారు. ఇప్పుడు మళ్లీ దావోస్ కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించడం ఆనందంగా ఉంద‌న్నారు నారా లోకేష్‌. నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశామ‌న్నారు.

ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామ‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్‌. ఆ మేరకే వారికి భూమి ఇచ్చాం అన్నారు. సీఎం చంద్రబాబుకు 11 నెలలు అంటే సుదీర్ఘ కాలం. ఆయనకు రియల్ టైమ్ లో నిర్ణయాలు జరగాలని ఆశిస్తారని చెప్పారు. ఆయన కేబినెట్ లో మంత్రులందరం స్వేచ్ఛగా రాష్ట్ర అభివృద్ధికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. విశాఖపట్నం ఐటీ, జీసీసీ కేంద్రంగా మారబోతోంద‌న్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుందన్నారు. వై నాట్ వైజాగ్ అనే ప్రశ్న ఉదయించేలా ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామ‌ని అన్నారు నారా లోకేష్‌.

Exit mobile version