Hero Ashok Galla-Visa Vintara Saradaga : ‘వీసా’ వింటారా స‌ర‌దాగా టీజ‌ర్ రిలీజ్

అమెరికాలోని తెలుగు వారి క‌ష్టాలే క‌థ

Hello Telugu - Hero Ashok Galla-Visa Vintara Saradaga

Hello Telugu - Hero Ashok Galla-Visa Vintara Saradaga

Visa Vintara Saradaga : తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో ఈ మ‌ధ్య కొత్త కొత్త సినిమాలు వ‌స్తున్నాయి. ఇందులో కొన్ని అనుకోకుండా తెర మ‌రుగైనా మ‌రికొన్ని మాత్రం ఆక‌ట్టుకునేలా ఉంటున్నాయి. ఇంకొన్ని ఆలోచింప చేస్తున్నాయి కూడా. ఇది ప‌క్క‌న పెడితే తాజాగా అమెరికాలో ఎక్కువ‌గా ఉండేది తెలుగు వాళ్లే. అక్క‌డంతా ఐటీ డామినేష‌న్. ఏ న‌గ‌రానికి వెళ్లినా యుఎస్ లో అంతా మ‌నోళ్లే క‌నిపిస్తారు. మ‌న‌తో క‌లిసి పోతారు. మ‌న‌తో మ‌న‌కు తెలియ కుండానే క‌నెక్టు అవుతారు. ఇక అమెరికా వెళ్లాలంటే నానా తతంగం. చ‌దువు కోసం వేలాది మంది , జాబ్స్ కోసం ఇంకొంత మంది అక్క‌డికి వెళ్లేందుకు నానా తంటాలు ప‌డుతుంటారు.

Visa Vintara Saradaga Movie Teaser Updates

ఒక్కోసారి ఇబ్బందుల‌కు లోన‌వుతారు. జీవితం అన్నాక బ‌త‌కాల్సిందే క‌నుక ఎలాగో స‌ర్దుకుని ముందుకు అడుగులు వేస్తుంటారు. ఏ దేశానికైనా వెళ్లాలంటే వీసా కావాల్సిందే. అది లేక పోతే విమానం మెట్లు ఎక్క‌లేం. దీనినే పాయింట్ గా తీసుకుని స‌ర‌దాగా అల్లిన క‌థే వీసా వింటారా స‌ర‌దాగా. ఇది ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు ఓ తార్కాణం అని చెప్ప‌క త‌ప్ప‌దు. కామెడీ కూడా పండించాడు. అమెరికాలోని తెలుగు విద్యార్థుల భావోద్వేగ , అస్త‌వ్య‌స్తంగా మారిన జీవితాల‌ను ఒక ఉత్తేజ‌క‌ర‌మైన దృక్ప‌థంతో చూపించేందుకు ప్ర‌య‌త్నం చేశాడు డైరెక్ట‌ర్.

తాజాగా వీసా వింటారా స‌ర‌దాగా (Visa Vintara Saradaga) టీజ‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. హాయిగా న‌వ్వుకునేలా, చూసేలా ఉంది. ఇందులో అశోక్ గ‌ల్లా (Ashok Galla), శ్రీ గౌరీ ప్రియ త‌ళుక్కున మెరిశారు. కొత్త స్నేహాలు, చిగురించే ప్రేమ‌లు, ఊహించ‌ని ఎదురు దెబ్బ‌లు..ఎలా ఎదుర్కొన్నార‌నే దానిని చూపించాడు డైరెక్ట‌ర్. ఇందులో శివాత్మ‌క రాజ‌శేఖ‌ర్, రాహుల్ విజ‌య్, హ‌ర్ష చెముడు కూడా ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. నాగ వంశీ, సాయి సౌజ‌న్య నిర్మించారు ఈ చిత్రాన్ని.

Also Read : Hero Dhanush-Kuberaa OTT : 18 నుంచి ఓటీటీలో కుబేర మూవీ స్ట్రీమింగ్

Exit mobile version