Kuberaa : సృజనాత్మకత కలిగిన దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం కుబేర. దీనికి కథను ప్రముఖ రచయిత్రి పింగళి చైతన్య రాశారు. మొదటిసారిగా దేవిశ్రీ ప్రసాద్ కథకు తగినట్టు సంగీతం అందించాడు. తను స్టార్ హీరోలు, హీరోయిన్ తో మూవీ తీయడం, అది బిగ్ హిట్ కావడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేసింది. ఇందులో భిక్షగాడు, ధనవంతుడికి మధ్య జరిగే ఆసక్తికరమైన కథే కుబేర. సినీ సంగీత విమర్శకులను సైతం సంబ్రమాశ్చర్యాల్లో నింపేలా చేసింది. ప్రధానంగా కథే ముఖ్యం. అది బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది కుబేర మూవీతో.
Kuberaa Movie OTT Updates
కొంచెం సాగదీసినట్టు అనిపించాన కుబేర (Kuberaa) ఊహించని విధంగా సక్సెస్ అయ్యింది. ఏకంగా రూ. 100 కోట్లను వసూలు చేసింది. ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున. వీరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. తనకు ఈ ఏడాది ఛావాతో పాటు కుబేర మంచి సంతృప్తిని కలిగించిందని చెప్పక తప్పదు. కానీ సల్మాన్ ఖాన్ తో ఏఆర్ మురుగదాస్ తీసిన సికిందర్ మాత్రం బోల్తా కొట్టింది బాక్సాఫీస్ వద్ద. తన సినీ కెరీర్ లో మరిచి పోలేని సినిమా, పాత్ర ఏదైనా ఉందంటే అది కుబేర మాత్రమేనని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.
ఇది పక్కన పెడితే తాజాగా కుబేర సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఈనెల 18న ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సినిమా స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు మూవీ మేకర్స్. ఇక థియేటర్లలో సినిమాను చూడలేని వాళ్లకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పక తప్పదు. సో ఆకట్టకునే సన్నివేశాలు, ఆలోచింప చేసే సంభాషణలు, వెరసి ధనుష్ భిక్షగాడి పాత్రలో లీనమై పోయిన వైనం ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా చేస్తుంది.
Also Read : hero Rajinikanth Coolie : విజిల్స్ వేయిస్తున్న కూలీ మౌనిక సాంగ్
