అనిరుధ్ – కావ్య మారన్ వివాహానికి కోట్ల‌ల్లో ఖ‌ర్చు..?

సంచ‌ల‌నంగా మారిన మ్యూజిక్ డైరెక్ట‌ర్, సీఈఓ

hellotelugu-AnirudhKavaMaran

చెన్నై : దక్షిణ భారత సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ , సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ నవంబర్ 11న గ్రీస్‌లో జరిగిన ఒక అంగరంగ వైభవ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఇందుక సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ వివాహం గ్రీస్‌లోని అత్యంత ఖరీదైన రిసార్ట్‌లలో ఒకటైన ‘ఫోర్ సీజన్స్ ఆస్టిర్ ప్యాలెస్ హోటల్’లో జరిగింది. వేడుక చాలా ప్రశాంతంగా, సన్నిహితుల సమక్షంలో జరిగినట్లు కనిపించినప్పటికీ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఇరు కుటుంబాలు దాదాపు రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

జాతీయ మీడియా కథనాల ప్రకారం కుటుంబ సభ్యులను , అతిథులను చెన్నై నుండి గ్రీస్‌కు తరలించేందుకు ప్రత్యేక ప్రైవేట్ విమానాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ విమాన ప్రయాణం, అతిథుల కోసం విలాసవంతమైన వసతి, వివాహ వేదిక వద్ద చేసిన ఏర్పాట్లు అన్నీ కలిపి మొత్తం ఖర్చు రూ. 100 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. నవంబర్ 21న చెన్నైలోని ఒక స్టార్ హోటల్‌లో భారీ రిసెప్షన్ నిర్వహించనుండటంతో ఈ వేడుకల ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. రిసెప్షన్ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకుంటే మొత్తం వివాహ బడ్జెట్ రూ. 150 కోట్లకు చేరుకోవచ్చని సమాచారం. అయితే ఈ గణాంకాలపై ఇరు కుటుంబాల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ నికర ఆస్తి విలువ సుమారు రూ. 24,600 కోట్లుగా ఉంది. ఆయనకున్న అపారమైన సంపదను దృష్టిలో ఉంచుకుంటే తన ఏకైక కుమార్తె వివాహం కోసం ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేశారనే వార్తలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే దీనిని నిర్వహించిన పద్ధతి. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అనిరుధ్ రవిచందర్, వేద మంత్రాలు , సాంప్రదాయ ఆచారాలతో వివాహం చేసుకుంటారని చాలామంది భావించారు. కానీ ఈ జంట పూర్తిగా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మార్గదర్శకత్వంలో వీరు ‘స్వయం మర్యాద వివాహ’ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

సాధారణ వివాహ ఆచారాలకు బదులుగా, ఈ జంట ఒకరికొకరు పూలదండలు, గొలుసులను మార్చుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ బహుకరించిన గొలుసును అనిరుధ్, కావ్య మెడలో అలంకరించారు. కావ్య ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ బహుకరించిన గొలుసును అనిరుధ్ మెడలో వేసింది.

Exit mobile version