Ace Movie : గత నెల మే23న తమిళ, తెలుగు భాషల్లో థియేటర్లలోకి మిశ్రమ స్పందనను దక్కించుకున్న రొమాంటిక్ క్రైమ్ డ్రామా చిత్రం ఏస్. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), రుక్మిణి వసంత్, దివ్యాపిళ్లై, యోగిబాబు , ఫృథ్వీ రాజ్ (బబ్లూ) కీలక పాత్రల్లో నటించారు. అర్ముగ కుమార్ దర్శకత్వం వహించగా సామ్ సీఎస్, జస్టిన్‌ప్రభాకరన్ సంగీతం అందించారు. అయితే పూర్ పబ్లిసిటీ వళ్ల అటు తమిళంలో, ఇటు తెలుగులో ప్రేక్షకులకు చేరువ కాలేక ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడన్గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి షార్ చేసింది.
Ace Movie OTT Updates
కథ విషయానికి వస్తే.. బోల్ట్ కన్నన్ జైలు నుంచి రిలీజై కొత్త జీవితం స్టార్ట్ చేసేందుకు మలేషియా వెళతాడు. అక్కడ జ్ఞానందం సాయంతో అక్కడే ఉంటూ కల్పన అనే యువతి హోటల్‌లో పని చేస్తుంటాడు. మరోవైపు మలేసియా పోలీసుగా పని చేసే కామంధుడైన పెంపుడు తండ్రి రాజా దొరైతో ఇబ్బందులు పడుతూ ఓ బట్టల షాప్‌లో పని చేస్తూ ఉంటుంది రుక్మిణి (Rukmini Vasanthi). అయితే తను అడిగిన డబ్బు ఇస్తే వదిలేస్తానని చెప్పడంతో పలుచోట్ల పని చేస్తూ డబ్బు కూడబెడుతూ ఉంటుంది. సేమ్ అపార్ట్‌మెంట్‌లో ఉండడంతో బోల్ట్ కన్నన్, రుక్మిణిల మధ్య పరిచయం ప్రేగా మారుతుంది.
ఇదిలాఉంటే.. ఓ వైపు కల్పన హోటల్ కోసం తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి కట్టలేక పోతుండడం, మరో వైపు రుక్మిణి తన పెంపుడు తండ్రి నుంచి బయట పడడానికి డబ్బులు అవసరం పడడంతో కన్నన్ వారి సమస్యలు తీర్చేందుకు నిర్ణయించుకుంటాడు. ఈక్రమంలో లోకల్‌గా అక్రమ వ్యాపారుల మధ్యకు వెళ్లి క్యాసినో తరహా గేమ్‌లు ఆడి లక్షల్లో బకాయి పడతారు. అయితే తమ డబ్బు కోసం ప్రాణాలు తీసే వారి నుంచి హీరో ఎలా బయట పడ్డాడు, అసలు హీరో ఆ గేమ్‌లు ఎందుకు ఆడాడు, కల్పన, రుక్మిణిల సమస్యలు తీర్చాడా, అక్కడ జరిగిన బ్యాంక్ రోబరికి కన్నన్‌కు మధ్య ఉన్న లింకేంటి అనే కథకథనాలతో సినిమా సాగుతూ ఆకట్టుకుంటుంది.
అయితే. సినిమాలో తర్వాత ఏం జరుగబోతుందనేది మనకు ముందే తెలుస్తున్నా చూసే ప్రేక్షలకు మాత్రం ఎక్కడా బోర్ కోట్టకుండా విజయ్ సేతుపతి(Vijay Sethupathi), యోగిబాబు పాత్రలు ఆకట్టుకుంటాయి. వారి మధ్య వచ్చే సంభాషణలు డార్క్ కామెడీతో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. విలన్లతో హీరో ఆడే గేమ్ కూడా సరదాగా సాగుతుంది. బ్యాంక్ దొంగతనం, కన్నన్ వేసే ఎత్తులు అన్నీ మంచి క్యూరియాసిటీని కలుగ జేస్తాయి. ఇప్పుడీ సినిమా జూన్ 13, శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తమిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి ఫన్ రైడ్ మూవీ చూడాలనుకునే వారికి ఈ ఏస్ సినిమా మంచి ఆఫ్సన్. ఎక్కడా ఎలాంటి అసభ్యత లేకుండా సినిమా అలా సరదాగా సాగి పోతూ ఉంటుంది.
Also Read : Beauty Avika Gor Marriage : పెళ్లి బాట పట్టిన చిన్నారి పెళ్లికూతురు ‘అవికా గోర్’
