నాగర్ కర్నూల్ జిల్లా : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మమిక మందన్నా తమ ఉదారతను చాటుకున్నారు. విజయ్ దేవరకొండకు సంబంధించి స్వంతూరు నాగర్ కర్నూల్ జిల్లా. దీంతో ఈ ప్రాంతంలోని ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న 10వ, 9వ తరగతిలో టాప్ లో మార్కులు సాధించిన విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు నటుడు విజయ్ దేవరకొండ. ఇందుకు సంబంధించి విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నా ఫ్యామిలీస్ కలిసి దేవరకొండ ఫౌండేషన్ ను ఏర్పాటు చేశారు.
గత ఏడాది కూడా టాప్ లో నిలిచిన విద్యార్థులను పిలిపించుకుని వారికి సన్మానం కూడా చేశారు. ఆపై వారికి మంచి విందు భోజనం కూడా ఏర్పాటు చేశారు. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది దేవరకొండ ఫౌండేషన్ నుంచి . ఈ మేరకు మాట నిలబెట్టుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని సంచలన ప్రకటించారు.
ఇచ్చిన మాట ప్రకారం, అచ్చంపేట డివిజన్ పరిధిలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9 , 10వ తరగతి పరీక్షలలో మొదటి, రెండవ ర్యాంకులు సాధించిన విద్యార్థుల జాబితాను దేవరకొండ ఫౌండేషన్ విడుదల చేసింది. ఆయా విద్యార్థినీ విద్యార్థులకు తమ ఫౌండేషన్ తరపున సాయం అందించనున్నట్లు ప్రకటించింది.



















