అన‌సూయ భ‌ర‌ద్వాజ్ పై రాశి షాకింగ్ కామెంట్స్

శివాజీ వ్యాఖ్య‌లు స‌బ‌బే వ్య‌క్తం చేసిన తీరు త‌గ‌దు

hellotelugu-ActressRashi

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టి , యాంక‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ చేసిన కామెంట్స్ పై ఇంకా రాద్దాంతం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా మ‌రో న‌టి రాశి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే ఇదే స‌మ‌యంలో స్త్రీల వ‌స్త్ర‌ధార‌ణ‌పై న‌టుడు శివాజీ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. ఇప్ప‌టికే ఆయ‌న సారీ కూడా చెప్పారు. ఇదే స‌మ‌యంలో తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ ఎదుట హాజ‌ర‌య్యాడు. తాను వేరే ఉద్దేశంతో అన‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ త‌రుణంలో తాజాగా త‌న‌కు స‌పోర్ట్ గా మ‌రికొంద‌రు ముందుకు వ‌చ్చారు. వారు త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేశారు. న‌టి రాశి కూడా స్పందించారు. శివాజీ మాటలు పూర్తిగా తప్పు కాదని రాశి స్పష్టం చేసింది. అయితే త‌ను వాటిని వ్యక్తం చేసిన తీరు సరికాదని ఆమె పేర్కొన్నారు.

అనసూయ భరద్వాజ్ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా న‌టుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్త్రీలు నిండుగా వ‌స్త్రాలు ధ‌రిస్తేనే అందంగా ఉంటార‌ని, స‌రుకులు క‌నిపించేలా చేస్తే కొంత సేపు చూస్తార‌ని ఆ త‌ర్వాత వారిని చుల‌క‌న చేసి మాట్లాడ‌తారంటూ పేర్కొన్నారు. వ‌స్త్ర‌ధార‌ణే మ‌హిళ‌ల ప‌ట్ల మ‌రింత గౌర‌వం పెంచేలా చేస్తుంద‌న్నాడు శివాజీ. దీనిపై చోటు చేసుకున్న రాద్దాంతం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు న‌టి రాశి. ఈ సంద‌ర్బంగా అనసూయ భ‌ర‌ద్వాజ్ యాంకరింగ్ చేసిన ఒక కామెడీ స్కిట్ గురించి ఆమె మాట్లాడారు. అందులో కమెడియన్ హైపర్ ఆది రాశి ఫలాలు అని ప్రస్తావిస్తూ ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యపై అనసూయ వేదికపై స్పందిస్తూ, ఆ పదబంధాన్ని సూచనాత్మక పద్ధతిలో ప్రశ్నించడం కూడా అంతే బాధాకరంగా ఉందని రాశి ఎత్తి చూపారు. ఒక మహిళ మరో మహిళ గురించి అలాంటి విధంగా ఎలా మాట్లాడగలదని ఆమె ప్రశ్నించారు.

Exit mobile version