Vaibhav : బీహార్ : స్టార్ యంగ్ క్రికెటర్ కేవలం 13 ఏళ్లకే క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇంకొకరైతే ఇతర కార్యకలాపాల్లో ఎంజాయ్ చేస్తారు. స్మార్ట్ ఫోన్స్ తో గడుపుతారు. కానీ బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ (Vaibhav) వచ్చీ రావడంతోనే రికార్డ్ బ్రేక్ చేశాడు. తన ఆటతీరుతో అద్భుతాలకు తెర తీశాడు. అంతే కాదు క్రికెటర్ల స్వర్గధామంగా పేరు పొందిన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) 2025లోకి అనూహ్యంగా వచ్చాడు. ఇదంతా భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కళ్లల్లో పడ్డాడు. ఇంకేం తనను ఏకంగా రాజస్థాన్ రాయల్స్ మేనేజిమెంట్ తరపున తనను ఏరికోరి రూ. ఒక కోటి కి తీసుకున్నాడు. అందరూ తనను వింతగా చూశారు.
Vaibhav Suryavanshi Growth
కానీ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాక తన సత్తా ఏమిటో చూపించాడు. ఇప్పటికే దేశీవాళి టోర్నీలలో దుమ్ము రేపుతున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. తాజాగా బీహార్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) ఇవాళ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తమ రాష్ట్రానికి చెందిన వైభవ్ సూర్యవంశీకి బిగ్ ఛాన్స్ ఇచ్చింది. ఏకంగా రంజీ ట్రోఫీ సందర్బంగా ఆడే తమ జట్టుకు తనను ఉప నాయకుడిగా నియమించింది. ఇది తన కెరీర్ లో తను ఆడుతున్న ఆట తీరుకు దక్కిన గౌరవంగా నిలిచింది అని చెప్పక తప్పదు. ఐపీఎల్ లో సెంచరీతో సత్తా చాటాడు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న అండర్ 15 ఆసియా క్రికెట్ జట్టుతో ఇండియా తరపున ఆడాడు. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.
Also Read : IND vs WI Test Match Interesting Update : అడ్డు గోడలా నిలబడిన కాంప్ బెల్, షాయ్
