అయ్య‌న్న పాత్రుడిపై హోం మంత్రి కితాబు

ప్ర‌శంస‌లు కురిపించిన వంగ‌ల‌పూడి అనిత

hellotelugu-AnithaVangalapudi

అనకాపల్లి జిల్లా : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఆద‌ర్శ ప్రాయుడు అని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. మంగ‌ళ‌వారం అనకాపల్లి జిల్లాలో ప‌ర్య‌టించారు. నర్సీపట్నం నియోజకవర్గం నాతవరంలో డాక్టర్ BR అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత. నాతవరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలు మాలలు వేసి, నివాళులర్పించారు. P.M. సూర్యఘర్ ముఫ్టీ బిజిలీ యోజన పథకం, యస్.సి., యస్.టి. సోలరైజేషన్ ను ప్రారంభించారు స్పీకర్, హోం మంత్రి. నాతవరం, గొలుగొండ, KD పేట పోలీస్ స్టేషన్ ల నూతన భవనాలను ప్రారంభించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు స్పీక‌ర్, హోం మంత్రి.

హోమ్ మినిస్టర్ అంటే ఎలాగా ఉండాలో చూపించిన ఏకైక హోం మంత్రి అనిత అని అభినందన‌ల‌తో ముంచెత్తారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అసెంబ్లీలో కూడా అందరికీ అర్థమయ్యేలా మాట్లాడే మంత్రి అనిత అని పేర్కొన్నారు. నాతవరం బహిరంగ సభలో హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్ర‌శంస‌లు కురిపించారు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడిపై. ఆయ‌న‌ మా గురువు, నన్ను ఎంతో ప్రోత్సహించారని పేర్క‌నొ్నారు. ఇవాళ స‌భాప‌తితో క‌లిసి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. సభాపతి అయ్యన్న నేతృత్వంలో అమరావతి రాజధాని బిల్లుకు చట్టబద్ధత కల్పించడం చాలా గ‌ర్వంగా ఉంద‌న్నారు అనిత వంగ‌ల‌పూడి.

Exit mobile version