బెంగళూరు : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కన్నడిగులకు ఉద్యోగ అవకాశాలు నిరాకరిస్తే చర్యలు తప్పవు అని హెచ్చరించారు. కర్ణాటకలో కన్నడిగులే సర్వోన్నతులు. వారి హక్కులు, గౌరవం, అవకాశాలను ఏ కారణం చేత కూడా విస్మరించడాన్ని ప్రభుత్వం సహించదు అని ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో ప్రైవేట్ సంస్థలు ఉద్దేశ పూర్వకంగా కన్నడిగులను ఉద్యోగ అవకాశాల నుండి పక్కన పెడుతున్నట్లు తేలితే, రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వార్నింగ్ ఇచ్చారు. కన్నడిగులకు అన్యాయం జరుగుతోందనే ఆందోళనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. వారి హక్కులు, గౌరవం , అవకాశాల విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. బెంగళూరులోని ఐటీ కంపెనీల్లో కన్నడిగులకు ఉద్యోగ అవకాశాలు నిరాకరిస్తున్నారనే ఫిర్యాదులు రావడం బాధాకరం అన్నారు సీఎం.
స్థానిక కన్నడ మాట్లాడే వ్యక్తులను పక్కన పెడుతున్నారనే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది” అని ఆయన అన్నారు. కర్ణాటకలో కన్నడిగులే సర్వోన్నతులు. వారి హక్కులు, గౌరవం , అవకాశాలను ఏ కారణం చేత కూడా విస్మరించడాన్ని ప్రభుత్వం అనుమతించదు అని ఆయన పునరుద్ఘాటించారు. బెంగళూరు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశపు సాంకేతిక రాజధానిగా గుర్తింపు పొందిందని పేర్కొన్న ఆయన, కన్నడిగుల ప్రతిభ, నైపుణ్యాలు , సామర్థ్యాల పట్ల రాష్ట్రం ఎంతో గర్విస్తోందని చెప్పారు. ఏదైనా ప్రైవేట్ సంస్థ ఉద్దేశ పూర్వకంగా కన్నడిగులను పక్కన పెట్టినట్లు తేలితే, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది అని ఆయన హెచ్చరించారు. కన్నడిగుల ప్రయోజనాలకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
