Vande Bharat Trains Growth : త్వరలో అందుబాటులోకి వందే భారత్ స్లీపర్ రైళ్లు

స్లీపర్ ట్రైన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి...

Hello Telugu - Vande Bharat Trains Growth

Hello Telugu - Vande Bharat Trains Growth

Vande Bharat : తక్కువ సమయంలో ఎక్కువ దూరాన్ని కవర్ చేసే వందే భారత్ ట్రైన్స్ ఇప్పటికే ప్రయాణికులలో బాగా పాపులర్ అయ్యాయి. కేవలం ఆరు–ఏడు గంటల్లో గమ్యానికి చేరుకునే ప్రత్యేకత ఈ ట్రైన్స్ ప్రత్యేకత. అయితే ఇప్పటివరకు వందే భారత్‌లో కేవలం సీటింగ్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా, స్లీపర్ సౌకర్యం కోసం ప్రయాణికులు ఎప్పటినుంచో వేచిచూస్తున్నారు. ఎట్టకేలకు, వందే భారత్ (Vande Bharat) స్లీపర్ ట్రైన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి.

Vande Bharat – ప్రారంభ సమయం

కేంద్ర ఐటీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకారం, దీపావళి నాటికి వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్దమవుతాయని తెలిపారు. ఇప్పటికే ఒక రైలు రెడీగా ఉంది, రెండో రైలు నిర్మాణంలో ఉంది. మొదటి సర్వీస్ పాట్నా–ఢిల్లీ మధ్యన ప్రారంభమవుతుంది. త్వరలో మిగతా సిటీలకు కూడా సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

సదుపాయాలు

వందే భారత్ స్లీపర్ రైలు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతోంది. 16 కోచ్‌లతో నడిచే ఈ రైలు గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

ప్రధాన సౌకర్యాలు:

ఈ స్లీపర్ ట్రైన్స్ ప్రారంభంతో, ప్రయాణికులు రాత్రి సమయంలో సౌకర్యవంతంగా, వేగంగా లక్ష్యానికి చేరుకునే అవకాశం పొందనున్నారు.

Also Read : Stock Market Shocking : 4వ రోజు కూడా నష్టాల్లో నడిచిన స్టాక్ మార్కెట్

Exit mobile version