బలిదానాలు వద్దు బరిగీసి కొట్లాడుదాం

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్

hellotelugu-VSrinivasGoud

హైద‌రాబాద్ : రాష్ట్రంలోని మూడు కోట్ల మంది బీసీల ఆకాంక్షలు నెరవేరాలని తమ అమూల్యమైన ప్రాణాలను తెగించిన తొలి బీసీ ఉద్యమ అమరవీరుడు సాయి ఈశ్వర చారి మరణించి ఐదు రోజులు గడిచినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలో ఆ కుటుంబాన్ని పరామర్శించక పోవడం అత్యంత బాధాకరమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు.

సాయి ఈశ్వర చారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బిజెపి లు మోసం చేసినందుకే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఈశ్వర చారి చెప్పారని అన్నారు. బీసీలను మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బీసీ సమాజం క్షమించదని ఆయన హెచ్చరించారు . ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే పార్లమెంట్ వేదికగా పోరాడాల్సిన కాంగ్రెస్ పోరాడకుండా వెనుకడుగు వేసిందనీ, బిజెపి బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా జాప్యం చేస్తూ బీసీల బలిదానాలకు కారకులయ్యారని ఆయన ఆరోపించారు

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈశ్వర చారి మరణమే చివరి మరణం కావాలని, బీసీలు ఎవరు ఆత్మహత్యల వైపు వెళ్లకుండా అగ్రకులాల ప్రభుత్వాలపై పోరాడడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు . బీసీలు బలిదానాలు చేసే రోజులు పోయాయని, బరిగీసి కొట్టడానికి సిద్ధపడాలని ఆయన కోరారు . ఈశ్వర చారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా, సొంత ఇంటిని మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Exit mobile version