Urjit Patel : ఢిల్లీ – భారత దేశానికి చెందిన ఉర్జిత్ పటేల్ (Urjit Patel) కు అరుదైన పదవి దక్కింది. ఆయన గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పని చేశారు. ఆర్థిక రంగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఇందులో భాగంగా తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కీలక ప్రకటన చేసింది. మాజీ గవర్నర్ ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమించినట్లు ప్రకటించింది. ఆయన అపాయింట్ అయిన నాటి నుంచి మూడు సంవత్సరాల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈమేరకు మోదీ ప్రభుత్వం తన ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆయన వెళ్లేందుకు ఆమోదం తెలిపింది.
Urjit Patel As a IMF Executive Director
కాగా ఉర్జిత్ పటేల్ ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఆయన మూడేళ్ల పాటు ఐఎంఎఫ్ కు సేవలు అందిస్తారని ఐఎంఎఫ్ ప్రకటించింది. కార్యనిర్వాహక బోర్డు సభ్య దేశాలు లేదా దేశాల సమూహాలచే ఎన్నుకోబడిన 25 మంది డైరెక్టర్లతో కూడి ఉంటుంది. భారతదేశం తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక , భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి ప్రపంచ అంతర్జాతీయ ద్రవ్య నిధిలో. ఈ నియామకానికి ముందు అర్జిత్ పటేల్ ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో పెట్టుబడి కార్యకలాపాలకు (రీజియన్ 1) వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. బీజింగ్‌కు చెందిన బహుళపక్ష నిధుల సంస్థ ప్రకారం కుటుంబ ఆరోగ్య విషయాల కారణంగా జనవరి 2024లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
రఘురామ్ రాజన్ తర్వాత 2016లో ఆర్బీఐ గవర్నర్ గా పటేల్ బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ 2018లో, కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి డివిడెండ్ బదిలీ అంశంపై ప్రభుత్వంతో జరిగిన గొడవ మధ్య ఆయన అకస్మాత్తుగా ఆ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ పదవిని చేపట్టడానికి ముందు, పటేల్ డిప్యూటీ గవర్నర్‌గా ద్రవ్య విధానం, ఆర్థిక విధాన పరిశోధన, గణాంకాలు. సమాచార నిర్వహణ, డిపాజిట్ బీమా, కమ్యూనికేషన్ . సమాచార హక్కును నిర్వహించారు.
Also Read : PM Modi – Japan Visit Interesting : జపాన్ కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీ
