న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఐ ఛార్జీలు విధిస్తున్నారని, అమెరికా ఒత్తిడికి లొంగి పోతున్నారని ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. రూ. 2,000 పైబడిన యూపీఐ మర్చంట్ బదిలీలపై విధిస్తున్న 0.4 శాతం ఫీజును ఉప సంహరించు కోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తోందని బీజేపీ ఆరోపించింది మరో వైపు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందు “సాష్టాంగ నమస్కారం” చేసి, అమెరికాకు భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలని నిర్ణయించు కున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీఐ చెల్లింపులపై ఫీజు విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అమెరికా ముందు పడుకోవడం ఆపండి, వెన్నెముక తెచ్చుకోండి, నిలబడండి అని హితవు పలికారు. యూపీఐ పన్నును వెనక్కి తీసుకోవాలని గాంధీ ప్రధానమంత్రి మోదీని కోరారు. ప్రభుత్వం అక్టోబర్ 15 నుండి UPI ద్వారా వ్యాపారులకు చేసే రూ. 2,000 కంటే ఎక్కువ విలువ గల బదిలీలపై 0.4 శాతం రుసుమును ప్రవేశ పెట్టింది. అదే సమయంలో రోజువారీ వ్యక్తిగత లావాదేవీలు , చిన్న చెల్లింపులపై ఎలాంటి ఛార్జీ విధించకుండా స్పష్టంగా మినహాయించింది. ఈ నిర్ణయంపై రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. మోదీ వామపక్షం కాదు, దక్షిణపక్షం కాదు, ఆయన డొనాల్డ్ ట్రంప్ ముందు నిటారుగా పడుకుని సాష్టాంగ నమస్కారం చేయాలని నిర్ణయించుకున్నారని ఎద్దేవా చేశారు. . జీరో ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను తొలగించి యూపీఐకి ఛార్జీ విధించాలన్న అమెరికా డిమాండ్‌కు ప్రభుత్వం లొంగి పోయిందని అన్నారు.
