Popular Actor Suresh Gopi : ఓటర్ల జాబితా తారుమారు అబ‌ద్దం

కేంద్ర మంత్రి, న‌టుడు సురేష్ గోపి

Hello Telugu - Popular Actor Suresh Gopi

Hello Telugu - Popular Actor Suresh Gopi

Suresh Gopi : కేర‌ళ – కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తాజాగా దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్న ఓటర్ల జాబితా తారుమూరుపై స్పందించారు. ఇది పూర్తిగా నిరాధారం, అబ‌ద్ద‌మ‌ని పేర్కొన్నారు. కేంద్ర ఎన్నిక‌ల సంఘం కేర‌ళ‌కు స‌మాధానం ఇస్తుంద‌న్నారు. ఆదివారం త్రిసూర్ లో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, వామపక్షాలు లేవనెత్తిన ఓటర్ల జాబితా తారుమారు ఆరోపణలకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో భారత ఎన్నికల కమిషన్ వారికి సమాధానం ఇస్తుందని స్ప‌ష్టం చేశారు. తాను మంత్రినని, తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నానని గోపి అన్నారు.

Popular Actor & Union Minister Suresh Gopi Key Comments

విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, తనపై ఓటర్ల జాబితా తారుమారు ఆరోపణలను లేవనెత్తిన వ్యక్తులను బిజెపి నాయకుడు కోతులు అంటూ పిలిచారు. వారు లేవదీసిన అనుమానాల‌కు త‌ప్ప‌కుండా ఈసీ జ‌వాబు ఇస్తుంద‌న్నారు. తాను దానిపై ఇప్పుడు మాట్లాడ‌టం స‌బ‌బు కాద‌న్నారు. వారు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లినప్పుడు వారికి సమాధానం లభిస్తుంది త‌ప్ప‌కుండా అని చెప్పారు సురేష్ గోపి (Suresh Gopi). గత సంవత్సరం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తనపై , బిజెపిపై ఓటర్ల జాబితాలో తారుమారు ఆరోపణలపై గోపి స్పందించడం ఇదే మొదటిసారి.

కేంద్ర మంత్రి కొచ్చి రాజ్యాన్ని పాలించిన శక్తిన్ తంబురాన్ విగ్రహానికి పూలమాల వేశారు. గత వారం, కాంగ్రెస్ గోపిపై కొత్త ఆరోపణలు చేసింది, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో త్రిస్సూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఓటర్ల జాబితాలో చేర్చడానికి తప్పుడు ప్రకటనను సమర్పించారని ఆరోపించింది.

Also Read : CM MK Stalin Shocking Comments : గ‌వ‌ర్న‌ర్ ర‌వి చీప్ పాలిటిక్స్ – సీఎం

Exit mobile version