న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా అర్దాంతరంగా ఏకంగా 1000కి పైగా ఇండిగో విమానాయన సంస్థకు చెందిన ఫ్లైట్స్ ను నిలిపి వేశారు. దీంతో వేలాది మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక పోవడంతో ఆయా ఎయిర్ పోర్టులలో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారంతా పడిగాపులు కాశారు. ఇదే క్రమంలో కేంద్ర సర్కార్ పై, విమానాయన శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయా విమానయాన సంస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన డీజీసీఏ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఇండిగో వ్యవహారం చర్చనీయాంశంగా మారడంతో రామ్మోహన్ నాయుడు స్పందించారు. మీడియాతో మాట్లాడారు. ఎక్కడ తప్పు జరిగిందో, ఎవరు తప్పు చేశారో వారు నిర్ధారించగలిగేలా వీటన్నింటిపై దర్యాప్తు చేయడానికి గాను ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
త్వరలోనే నివేదిక వస్తుందని , నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు కింజరాపు అచ్చెన్నాయుడు. దీనికి బాధ్యులు ఎవరైనా సరే దానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే అవసరమైన సిబ్బంది, నడిపేందుకు కావాల్సిన పైలట్లు అందుబాటులో లేక పోవడం వల్లనే అర్ధాంతరంగా విమానాలను నిలిపి వేయల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇండిగో సంస్థ సీఈవో. మరో వైపు సాంకకేతిక లోపం, కార్యాచరణ సమస్యల కారణంగా 1000కి పైగా ఇండిగో విమానాలను నిలిపి వేశామన్నారు. దీనికి సంబంధించి నెట్‌వర్క్‌ను నిశితంగా పరిశీలించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ని ఆదేశించారు రామ్మోహన్ నాయుడు.
