Union Minister Meghwal Alarming : దేశ వ్యాప్తంగా 725 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయ స్థానాలు

వెల్ల‌డించిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

Hello Telugu - Union Minister Meghwal Alarming

Hello Telugu - Union Minister Meghwal Alarming

Union Minister Meghwal : ఢిల్లీ : దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, పోక్సో చట్టం కింద న‌మోదైన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు (FTSCs) ఇప్పటి వరకు లక్షలాది కేసులను పరిష్కరించ‌డం జ‌రిగింద‌న్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ ఘేఘ‌వాల్ (Union Minister Meghwal). ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాలు 725 కోర్టులు వున్నాయని వెల్ల‌డించారు. వీటిలో 392 ప్రత్యేక పోక్సో కోర్టులు ఉన్నాయని, ఇప్పటివరకు ఈ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయస్థానాల్లో 5.38 లక్షలకుపైగా కేసులు దాఖలవగా, 3.34 లక్షలకుపైగా కేసులు పరిష్కారమైన‌ట్లు శుక్ర‌వారం లోక్ స‌భ‌లో ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు.

Union Minister Meghwal Key Comments

కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలవుతున్న ఈ ప‌థ‌కాన్ని 31 మార్చి 2026 వరకు కొనసాగుతుందని, దేశ వ్యాప్తంగా 790 కోర్టులు ఏర్పాటు చేయాలన్న‌ లక్ష్యం తో రూ.1952.23 కోట్లు ఖర్చు చేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందులో రూ. 1207.24 కోట్లు కేంద్ర భాగంగా నిర్భయ నిధి నుంచి వెచ్చించనున్న‌ట్లు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Union Minister Meghwal) వెల్ల‌డించారు.

ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు (FTSCs) ఆంధ్రప్రదేశ్‌లో 16 వున్నాయ‌ని, 2019 నుండి ఇప్పటివరకు ఎపీకి రూ.1.8 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేసిన‌ట్లు వివ‌రించారు. దేశ వ్యాప్తంగా 2019 నుండి ఇప్పటి వరకు రూ.1034.55 కోట్లు విడుదల చేశామ‌న్నారు. ఇక ఎపీలో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులు పోక్సో కేసులు పరిష్కరించడానికి స‌గ‌టున‌ 257 రోజులు స‌మ‌యం ప‌ట్టిందన్నారు.

మౌలిక వసతుల పెంపు కోసం కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింద‌న్నారు. 2014లో దేశ వ్యాప్తంగా 15,818 కోర్టు హాల్స్ ఉండగా, ప్రస్తుతం అవి 22,372కి, నివాస యూనిట్లు 19,851కి పెరిగాయన్నారు మంత్రి. అదనంగా 3,128 కోర్టు హాళ్లు, 2,772 నివాస యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. .

FTSCల పనితీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రాలు, హైకోర్టులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు కేసుల సమయ పూర్వక పరిష్కారం కోసం కేంద్రం లేఖలు పంపిందని స్ప‌ష్టం చేశారు.

Also Read : Harish Rao Warning to Nara Lokesh : మా నీటి వాటా కోసం నిల‌దీస్తాం..కొట్లాడుతాం

Exit mobile version