Harish Rao : హైదరాబాద్ – మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నిప్పులు చెరిగారు. మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . దమ్ముంటే తెలంగాణలో అడుగు పెట్టాలని అన్నారు. ఇకనైనా నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హితవు పలికారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక్కడ ఉన్నది మీకు సపోర్ట్ చేసే , మోసం చేసే నాయకులు కాదన్నారు. బరాబర్ గిరిగీసి కొట్లాడే దమ్మున్న గులాబీ సైన్యం ఉందన్నారు. చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తే తప్పదు పరాభవం అని వార్నింగ్ ఇచ్చారు.
MLA Harish Rao Slams Nara Lokesh
మా నీళ్లు మాకు కావాలని మాట్లాడేతే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టా అని ప్రశ్నించారు. మా ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ సాధించిన పార్టీగా మాకు దక్కాల్సిన నీటి వాటాపై తప్పకుండా మాట్లాడతామని, గిరిగీసి కొట్లాడుతామని అన్నారు. ఆంధ్రా మంత్రి లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతం అంటుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్, కాంగ్రెస్ మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని అన్నారు హరీశ్ రావు.
మీరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు కాబట్టే.. మీ ధైర్యం చూసుకొని లోకేష్ అలా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడని ఆరోపించారు. బనకచర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మౌనమే కారణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మీ ఇష్టమొచ్చినట్లు పోతిరెడ్డి పాడుకు పొక్కపెట్టి నీళ్లు తీసుకపోయినట్టు.. ఇప్పుడు నీళ్లు తీసుకుపోతా అంటే చూస్తూ ఊరుకుంటాం అనుకున్నావా లోకేష్ అని ఫైర్ అయ్యారు.
Also Read : YS Sharmila Fired on CM Chandrababu : 30 లక్షల మంది రైతులకు బాబు టోకరా
