భార‌త్ త‌న గ‌ళాన్ని వినిపించే ప్ర‌య‌త్నం చేస్తుంది

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

hellotelugu-PMModi

ఫ్రాన్స్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఫ్రాన్స్ లో జ‌రుగుతున్న జి7 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల గళాన్ని భారత్ వినిపిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లోని నీస్ నగరానికి చేరుకున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం అనేది ప్రపంచ దేశాలకు భారత్‌పై ఉన్న విశ్వాసాన్ని , అంతర్జాతీయ వేదికపై దేశానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు. జూన్ 13 నుండి 18 వరకు ఫ్రాన్స్ , స్లోవేకియా దేశాలలో ఆరు రోజుల పర్యటనకు బయలుదేరే ముందు ప్ర‌ధాని ఈ ప్రకటన చేశారు. ఈ పర్యటనలు ఐరోపా, G7తో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు.

అలాగే భాగస్వామ్యాల పరిధిని విస్తరించడంలో భారత్‌కు ఉన్న దృఢ నిబద్ధతను చాటుతాయని ఆయన పేర్కొన్నారు. G7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సమావేశం అయ్యారు. ఒక సీనియర్ అమెరికా ప్రభుత్వ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఫ్రాన్స్‌లో జరిగే సదస్సులో మిత్ర దేశాలతో కలిసి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో మందు పాతరలను తొలగించే ప్రణాళికలపై ట్రంప్ చర్చించే అవకాశం ఉందన్నారు ప్ర‌ధాన‌మంత్రి. తన పర్యటనకు ముందు చేసిన ప్రకటనలో, భారత్ వ్యూహాత్మక దార్శనికతలో ఫ్రాన్స్‌కు ప్రత్యేక స్థానం ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్‌ను సందర్శించారు.

Exit mobile version