ఇండిగో సంస్థ నిర్వాకంపై కేంద్రం సీరియ‌స్

దిగి వ‌చ్చిన సంస్థ ప్ర‌యాణీకుల‌కు డ‌బ్బులు చెల్లింపు

hellotelugu-RamMohanNaidu

న్యూఢిల్లీ : విమానాశ్రయాలలో ప్రయాణీకుల అసౌకర్యాన్ని తగ్గించడానికి గత నాలుగు రోజులుగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింద‌ని చెప్పారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. ఢిల్లీలోని త‌న కార్యాల‌యంలో అత్య‌వ‌స‌ర సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా ఇండిగో సంస్థ అర్దారంతంగా త‌మ త‌ర‌పున న‌డుపుతున్న విమాన స‌ర్వీసుల‌ను రద్దు చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక క‌మిటీని ఏర్పాటు చేశారు ద‌ర్యాప్తు చేసేందుకు . ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు వివ‌రాలు అంద‌జేయాల‌ని ఆదేశించారు. ఈ కీల‌క స‌మీక్ష‌లో సంస్థ త‌ర‌పున ప్ర‌తినిధులు కూడా హాజ‌ర‌య్యారు.

కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డంతో ఎట్టకేల‌కు ఇండిగో సంస్థ దిగి వ‌చ్చింది. ఈ మేర‌కు రూ. 610 కోట్లు ప్ర‌యాణీకుల‌కు చెల్లించింది. మిగ‌తా డ‌బ్బుల‌ను కూడా రీఫండ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ అసౌక‌ర్యం క‌లిగించినందుకు మ‌న్నించాల‌ని కోరారు ఇండిగో సంస్థ ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి. అయితే ఎందుకు ఇలా చేశార‌నే దానిపై పూర్తిగా నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు. మ‌రో వైపు దేశ వ్యాప్తంగా గ‌త కొంత కాలంగా ఎయిర్ లైన్స్ సంస్థలు అనుస‌రిస్తున్న ఒంటెద్దు పోక‌డ‌లు, విధానాల‌ను తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు ప్ర‌యాణీకులు.

Exit mobile version