Union Cabinet Approved : రూ.30 వేల కోట్ల ప‌రిహారానికి కేంద్రం ఓకే

చెల్లించేందుకు మంత్రివ‌ర్గం తీర్మానం

Hello Telugu - Union Cabinet Approved

Hello Telugu - Union Cabinet Approved

Union Cabinet : ఢిల్లీ – కేంద్ర మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశీయ ఎల్పీజీల‌లో చోటు చేసుకున్న‌ నష్టాలకు ప్రభుత్వ రంగ సంస్థ‌ల‌కు రూ.30,000 కోట్ల పరిహారం చెల్లించడానికి మంత్రివర్గం ఆమోదం (Union Cabinet) తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ శుక్రవారం మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేషన్, భార‌తీయ పెట్రోల్ కార్పొరేష‌న్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ దేశీయ‌య ఎల్పీజీ అమ్మ‌కాల‌పై వచ్చిన తక్కువ రికవరీలకు రూ.30,000 కోట్ల పరిహారాన్ని చెల్లించేందుకు ఆమోదించింది.

Union Cabinet Approved

కాగా ఓఎంసీల‌లో పరిహార పంపిణీని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. పరిహారం 12 విడతలుగా చెల్లించనున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ప్రభుత్వం ప్రకారం, ఈ ముఖ్యమైన చర్య ఈ పీఎస్ ఓ ఓఎంసీల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రపంచ ఇంధన మార్కెట్లలో అస్థిరత నుండి వినియోగదారులను రక్షించడానికి తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశీయ ఎల్ పీ జీ సిలిండర్లను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిత్యం వాడే గ్యాస్ వినియోగదారులకు నియంత్రిత ధరలకు సరఫరా చేస్తాయి.

2024-25లో అంతర్జాతీయ ధరలు అధిక స్థాయిలోనే ఉన్నాయి . ఇప్పటికీ అధిక స్థాయిలోనే ఉన్నాయ‌ని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలలో హెచ్చుతగ్గుల నుండి వినియోగదారులను రక్షించడానికి, ధర పెరుగుదలను దేశీయ వినియోగదారులకు బదిలీ చేయలేదు.

Also Read : Free Bus Service : మ‌హిళ‌ల‌కు ప‌లు రాష్ట్రాలు బంప‌ర్ ఆఫ‌ర్

Exit mobile version