పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ల ప్ర‌యోగం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ర‌ష్యా స‌ర్కార్

hellotelugu-UkraineDrone

ర‌ష్యా : ర‌ష్యా స‌ర్కార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. త‌మ దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివ‌సిస్తున్న ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్ల‌తో దాడుల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ. ఇదంతా కావాల‌ని చేస్తున్న కుట్ర‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. అయితే ఇది వాస్త‌వమ‌ని, త‌మ వ‌ద్ద దాడుల‌కు సంబంధించిన ఆధారాలు ఉన్నాయ‌ని, స‌మ‌ర్పించేందుకు సిద్దంగా ఉన్నామంటూ ప్ర‌క‌టించింది ర‌ష్యా ప్ర‌భుత్వం. దీంతో ఇరు దేశాల మ‌ధ్య ఇప్ప‌టికే అంత‌ర్యుద్దం కొన‌సాగుతోంది. మ‌రో వైపు ఈ దాడుల నేప‌థ్యంలో విచ‌క్ష‌ణా ర‌హితంగా ర‌ష్యా దీనిని బూచిగా చూపించి దాడుల‌కు తెగ‌బ‌డే ప్ర‌మాదం లేక పోలేదు.

ఇదిలా ఉండ‌గా మ‌రో వైపు డ్రాగ‌న్ చైనా క‌య్యానికి కాలు దువ్వుతోంది. ఏకంగా తైవాన్ దేశం చుట్టూ సైనిక విన్యాసాల‌ను మంగ‌ళ‌వారం నాటి నుంచి ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్. దీంతో కొత్త సంవ‌త్స‌రం రాబోయే కొన్ని గంట‌లకు ముందు యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొనుంద‌ని ఇత‌ర దేశాలు ఆందోళ‌న చెందుతున్నాయి. దీనిపై తైవాన్ స‌ర్కార్ సైతం స్పందించింది. చైనా దురాక్ర‌మ‌ణ‌కు తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని మ‌రోసారి వార్నింగ్ ఇచ్చింది. చైనాను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా తైవాన్ కు అమెరికా స‌పోర్ట్ చేస్తోంది. ఇక ఓ వైపు ర‌ష్యా ఇంకో వైపు చైనా ఉక్రెయిన్, తైవాన్ ల విష‌యంలో ఎలా ముందుకు వెళ‌తాయ‌నేది ఉత్కంఠ రేపుతోంది.

Exit mobile version