Uddhav Thackeray : ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే (Uddhav Thackeray) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా కీలకమైన అంశంగా మారిన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఈనెల 14న దుబాయ్ వేదికగా జరిగే కీలక మ్యాచ్ గురించి స్పందించారు. ఇది దేశానికి తీరని అవమానకరమని పేర్కొన్నారు. ఇది పూర్తిగా జాతీయ భావాలకు వ్యతిరేకమన్నారు. దీని వెనుక భారీ ఎత్తున వ్యాపారం దాగి ఉందంటూ మండిపడ్డారు. రెండు దేశాల మధ్య జరిగే ఆసియా కప్ మ్యాచ్‌ను బహిష్కరించడం చేయడం మంచిదని సూచించారు. ఉగ్రవాదంపై మన వైఖరిని ప్రపంచానికి తెలియ జేయడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందన్నారు.
Uddhav Thackeray key Comments on India-Pakistan Match
భారత సైనికులు సరిహద్దుల్లో తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నందున పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటం జాతీయ భావాలకు అవమానం అని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు . ముంబైలో శనివారం థాకరే మీడియాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మ్యాచ కు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ క్రికెట్ మ్యాచ్ జాతీయ భావాలకు అవమానం కాక మరేమిటి అని ప్రశ్నించారు. మన సైనికులు సరిహద్దుల్లో తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నప్పుడు మనం పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడాలా? అని ప్రశ్నించారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. థాకరే క్రికెట్ మ్యాచ్‌ను దేశభక్తిపై ఒక జోక్‌గా అభివర్ణించారు. థాకరే కుటుంబ ముంబై నివాసమైన మాతోశ్రీలో బాల్ థాకరే, పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ మధ్య జరిగిన పాత సమావేశాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ నుండి భారతదేశంపై ఉగ్రవాద చర్యలు కొనసాగే వరకు క్రికెట్ ఉండదని నా తండ్రి జావేద్ మియాందాద్‌తో చెప్పారని గుర్తు చేశారు.
Also Read : YS Sharmila Fired on AP Govt : ఆదివాసీ బిడ్డలపై కూటమి సర్కార్ వివక్ష
