TVK Vijay Emergency Meeting : టీవీకే విజ‌య్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

బాధిత కుటుంబాల‌కు నిర్మ‌ల ప‌రామ‌ర్శ

Hello Telugu - TVK Vijay Emergency Meeting

Hello Telugu - TVK Vijay Emergency Meeting

TVK Vijay : చెన్నై : త‌మిళ‌నాడులోని క‌రూర్ లో టీవీకే విజ‌య్ చేప‌ట్టిన ర్యాలీలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. గాయ‌ప‌డిన వారిలో మ‌రికొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ ఘ‌ట‌నపై స్పందించారు ఆ పార్టీ చీఫ్‌. సోమ‌వారం అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. సీనియ‌ర్ నాయ‌కుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ చేప‌ట్టారు. తన పట్టినపాకలోని పెంట్ హౌస్ నుండి సీనియర్ నాయకులతో మాట్లాడారు. టీవీకే చీఫ్ విజయ్‌ను (TVK Vijay) రక్తపు మరకలతో చిత్రీకరించిన పోస్టర్లు కరూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వెలిశాయి. మరణించిన వారిలో 18 మంది మహిళలు, 13 మంది పురుషులు, ఐదుగురు యువతులు, ఐదుగురు యువకులు ఉన్నారు. ఇప్పటి వరకు కరూర్ జిల్లా నుండి 34 మంది బాధితులు, ఈరోడ్, తిరుప్పూర్ , దిండిగల్ జిల్లాల నుండి ఇద్దరు, సేలం జిల్లా నుండి ఒకరు ఉన్నారు.

TVK Vijay Emergency Meeting

ఈ సంద‌ర్బంగా బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు క్యూ క‌ట్టారు. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సంద‌ర్శించారు. కేంద్రం త‌ర‌పున రూ. 2 ల‌క్ష‌లు , గాయ‌ప‌డిన వారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం చేస్తామ‌న్నారు. ఇక ఇప్ప‌టికే తమిళ‌నాడు ప్ర‌భుత్వం మృతి చెందిన కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 10 ల‌క్ష‌ల ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. మ‌రో వైపు టీవీకే విజ‌య్ ప్ర‌తి కుటుంబానికి రూ. 20 ల‌క్ష‌ల‌తో పాటు గాయ‌ప‌డిన ప్ర‌తి ఒక్క‌రికీ వైద్య ఖ‌ర్చుల‌ను తామే భ‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ. 2 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నారు. మొత్తంగా ఈ ఘ‌ట‌న చివ‌ర‌కు టీవీకే విజ‌య్ మెడ‌కు చుట్టుకోనుంద‌ని స‌మాచారం.

Also Read : KTR Fired on CM Revanth : బాకీ కార్డుతో రేవంత్ సర్కార్‌ భరతం పడతాం

Exit mobile version