KTR Fired on CM Revanth : బాకీ కార్డుతో రేవంత్ సర్కార్‌ భరతం పడతాం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Fired on CM Revanth

Hello Telugu - KTR Fired on CM Revanth

KTR : హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. బాకీ కార్డుతో రేవంత్ సర్కార్‌ భరతం పడతామ‌ని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అభయ హస్తం ఆ పార్టీ పాలిట భస్మాసుర హస్తంగా మారింద‌న్నారు. రోమ్ తగల బడుతుంటే నీరోలా రేవంత్ రెడ్డి తీరు ఉంద‌న్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గులాబీదే హవా కొన‌సాగ‌డం ఖాయ‌మ‌న్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్‌దే విజయం సాధిస్తుంద‌న్నారు. సోమ‌వారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు టీడీపీ సీనియర్ నేత ప్రదీప్ చౌదరి. కాంగ్రెస్ మోసాలను ఎండ గట్టేందుకు ప్రారంభించిన ‘బాకీ కార్డు’ ఉద్యమమే రేవంత్ సర్కార్‌ భరతం పట్టే బ్రహ్మాస్త్రమని కేటీఆర్ అన్నారు.

KTR Slams CM Revanth Reddy

గల్లీ ఎన్నికలైనా, ఢిల్లీ ఎన్నికలైనా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని, తెలంగాణలోని సబ్బండ వర్ణాలు తిరిగి కేసీఆర్‌నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాయని చెప్పారు. తాము ఇచ్చిన హామీలను ప్రజలు మరిచి పోయారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కానీ ప్రజలకు అన్నీ గుర్తు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను గుర్తు చేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ బాకీ కార్డే కాంగ్రెస్ పతనాన్ని శాసిస్తుందన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరం సమస్యలతో ఆగమాగం అవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త నగరం కడతానంటూ ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Also Read : Deputy CM Bhatti Challenge : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటుతాం

Exit mobile version