TVK Vijay : చెన్నై : తాను చేపట్టిన టీవీకే పార్టీ ప్రచార ర్యాలీ సందర్బంగా కరూర్ లో చోటు చేసుకున్న ఘోరమైన ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తనపై , పార్టీపై కేసు నమోదైంది హైకోర్టులో. విచారణ చేపట్టిన ధర్మాసనం సీరియస్ అయ్యింది. అంతే కాదు నటుడు విజయ్ అక్కడి నుండి ఎలా వెళ్లి పోతాడంటూ ప్రశ్నించింది. వెంటనే తనపై కేసు నమోదు చేయాలని , దీనికి తనే కారకుడనే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా కోర్టు సంచలన ప్రకటన చేసింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా పేరు పొందిన వ్యక్తి ని నియమించాలని, ప్రత్యేక దర్యాప్తు వెంటనే చేపట్టాలని రాష్ట్ర డీఎంకే సర్కార్ ను ఆదేశించింది. ఈ తరుణంలో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్.
TVK Vijay Support to Karur Victims
రాష్ట్ర సర్కార్ ముందస్తుగా చని పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. అంతే కాకుండా తీవ్రంగా గాయపడిన వారికి తాత్కాలిక ఉపశమనం కింద ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం ఎంకే స్టాలిన్. ఆ తర్వాత నేతలు పోటెత్తారు పరామర్శించేందుకు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. రూ. 2 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. గాయపడిన వారికి రూ. 50 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇదే ఘటనకు సంబంధించి బహిరంగ ప్రకటన చేశాడు విజయ్ (TVK Vijay). ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షలు ఇస్తానని , వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని అన్నాడు. కాగా ఘటన జరిగి ఇన్ని రోజులైనా ఇంకా కలవక పోవడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇవాళ వీడియో కాల్స్ ద్వారా బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Also Read : Supreme Court Clear Instructions : కలుషిత దగ్గు మందు మరణాలపై ధర్మాసనం కీలక ఆదేశాలు

















