TVK Vijay : చెన్నై : ప్రముఖ నటుడు , టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ (TVK Vijay) కు కోలుకోలేని షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్రంలో గత నెల సెప్టెంబర్ 27న తాను జరిపిన టీవీకే ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. తనను యావత్ దేశం ముందు దోషిగా నిలబెట్టేలా చేసింది. ఈ ఘటనలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకు మించి 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ దారుణ విషాదానికి తానే కారణమంటూ అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. చని పోయిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్. వైద్య ఖర్చుల నిమిత్తం కూడా ఆదుకుంటామని తెలిపారు. మరో వైపు కేంద్ర హోం శాఖ సీరియస్ అయ్యింది ఈ సంఘటనపై. విచారణకు ఆదేశించింది. అంతే కాకుండా ఏం జరిగిందో పూర్తి నివేదిక ఇవ్వాలని కోరింది.
High Court Shocking TVK Vijay
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. కేంద్రం తరపున ఒక్కో కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక దళపతి విజయ్ టీవీకే పార్టీ తరపున చని పోయిన ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షలు, గాయపడిన వారికి పూర్తి వైద్య ఖర్చులు తామే భరిస్తామని వెల్లడించారు. కరూర్ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్ద ఎత్తున మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. శుక్రవారం ఈ పిటిషన్లపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ మేరకు సంచలన ప్రకటన చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా సీనియర్ పోలీస్ ఆఫీసర్ అస్రా గార్గ్ ను విచారణ అధికారిగా నియమించాలని స్పష్టం చేసింది. ఆయన నిక్కచ్చి ఆఫీసర్ గా పేరు పొందారు.
Also Read : Kantara 1 Huge Collections : కాంతారా చాప్టర్ -1 రికార్డ్ రూ. 60 కోట్లు వసూలు
