Kantara 1 Huge Collections : కాంతారా చాప్ట‌ర్ -1 రికార్డ్ రూ. 60 కోట్లు వ‌సూలు

ప్ర‌పంచ వ్యాప్తంగా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది

Hello Telugu - Kantara 1 Huge Collections

Hello Telugu - Kantara 1 Huge Collections

Kantara 1 : బెంగ‌ళూరు : క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో వెరీ స్పెష‌ల్ గా మారి పోయాడు న‌టుడు, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి. త‌ను న‌టించిన తాజా చిత్రం కాంతారా చాప్ట‌ర్ -1 (Kantara 1) మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దూసుకు పోతోంది. క‌లెక్ష‌న్ల ప‌రంగా సినీ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ ఏకంగా తొలి రోజు రూ. 60 కోట్లు వ‌సూలు చేసింది. ఔరా అనిపించింది. ఈ సినిమాను గాంధీ జ‌యంతి అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్.

Kantara 1 Movie Updates

ఇక ఈ భారీ వ‌సూళ్ల ప‌రంగా చూస్తే హిందీ వెర్ష‌న్ కాంతారా చాప్ట‌ర్ -1 మూవీకి రూ. 21 కోట్లు వసూల్ అయ్యాయి. ఇక క‌న్న‌డ వెర్ష‌న్ లో 88.13 శాతం ఆక్యుపెన్సీ సాధించ‌డం విశేషం. తెలుగులో 75.54 శాతం, త‌మిళంలో 71. 42 శాతం ఆక్యుపెన్సీ సాధించ‌గా మ‌ల‌యాళంలో 66.61 శాతం ఉంది. గ‌తంలో రిష‌బ్ శెట్టి న‌టించిన కాంతారా మూవీ 2022వ సంవ‌త్స‌రంలో వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైంది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా రూ. 400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టికే క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కేజీఎఫ్ వ‌సూళ్ల ప‌రంగా చూస్తే టాప్ లో ఉంది. ఆ త‌ర్వాత కాంతారా నిలిచింది. దీనికి సీక్వెల్ గా కాంతారా చాప్ట‌ర్ -1 తీశారు మూవీ మేక‌ర్స్.

ఇక న‌టుడు, ద‌ర్శ‌కుడు రిష‌బ్ శెట్టి సీక్వెల్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా రుక్మిణి వ‌సంత్ , గుల్ష‌న్ దేవ‌య్య‌, జ‌య‌రామ్ , రాకేశ్ పూజారి న‌టించారు. జాన‌ప‌ద క‌థ‌ల ఆధారంగా దీనిని రూపొందించారు.

Also Read : Hero Dhanush Movie Idly Kadai : ధ‌నుష్ ఇడ్లీ క‌డై తొలి రోజే రూ. 11 కోట్లు

Exit mobile version