చెన్నై : తమిళనాడులో ఎన్నికల ప్రచారం హోరందుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుండడంతో ఎవరు గెలుస్తారని, ఏ కూటమి పవర్ లోకి వస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ నటుడు , టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ చేసిన కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై.
ఇదిలా ఉండగా శాసనసభ ఎన్నికల్లో DMK, TVKలకు వ్యతిరేకంగా తాను పోటీ పడుతున్నానన నటుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు. రాజకీయాల్లోకి కొత్తగా ప్రవేశించే పార్టీలు ఎప్పుడూ ఇటువంటి వ్యాఖ్యలే చేస్తుంటాయన్నారు కె. అన్నామలై. తమ పార్టీని ప్రారంభించినప్పుడు సీమాన్ కూడా సరిగ్గా ఇదే మాట అన్నారంటూ గుర్తు చేశారు. ఇవాళ సీమాన్ పార్టీ ఎక్కడుందో మీకందరికి తెలియదా అని ప్రశ్నించారు.
ఆయన ఇంకా ఇలా పేర్కొన్నారు: NDA కూటమిలోని ప్రతి ఒక్కరూ ఎన్నికల పనుల కోసం కఠినంగా శ్రమిస్తున్నారని అన్నారు. కానీ DMK నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమిలో మాత్రం ఎటువంటి ఐక్యత లేదని మండిపడ్డారు. . పుదుచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ స్టాలిన్ పేరును ప్రస్తావించ లేదని గుర్తు చేశారు. అదే విధంగా, స్టాలిన్ నిర్వహించిన ప్రచార సభలోనూ రాహుల్ స్టాలిన్ పేరును ప్రస్తావించ లేదన్నారు. ఈసారి ఎన్నికల్లో ఏఐఏడీఎంకే, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కె. అన్నామలై.















