హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న నేరాల అదుపుపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు డీజీపీ సీవీ ఆనంద్. ఈరోజు మెరుగు పరచాల్సిన యూనిట్ల క్రైమ్ , ఎన్ సీఎల్ ర్యాంకింగ్లపై ఇవాళ సమీక్ష చేపట్టారు . ఇది ఒక కొత్త పద్ధతి అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా జూలై, ఆగస్టు నెలల పనితీరును పరిశీలించారు.
క్రైమ్ ర్యాంకింగ్ కోసం తాము యూఐ కేసుల పరిష్కారం, ITSSO పరిష్కారం, PT పరిష్కారం, శిక్షలు, ఆన్-సైట్ FIRలు , ఇ-పెట్టీ కేసులను పరిశీలించడం జరిగిందని చెప్పారు డీజీపీ. వనపర్తి, నిర్మల్, సైబరాబాద్, సూర్యాపేట , జీఆర్పీ సికింద్రాబాద్‌లను వివరంగా సమీక్షించామన్నారు. ప్రస్తుతం తెలంగాణ 31వ స్థానంలో ఉన్న ఎన్సీఎల్ ర్యాంకింగ్ కోసం తాము మల్కాజిగిరి, హైదరాబాద్ , నిజామాబాద్ కమిషనరేట్లు, మహబూబ్‌నగర్, జీఆర్పీ సికింద్రాబాద్ , యాదాద్రి భోంగిర్లలో ఇ-సాక్ష్య, బీఎన్ఎస్ దర్యాప్తులు , జీరో FIRలను పరిశీలించినట్లు వెల్లడించారు.
యూనిట్ అధికారులకు వారి వారి యూనిట్ ర్యాంకింగ్‌ను ప్రభావితం చేస్తున్న నిర్దిష్ట అంశాలను చూపించి, వివరణలు కోరి, తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు. వ్యక్తిగత యూనిట్ల పనితీరే తెలంగాణ మొత్తం స్థానాన్ని నిర్ణయిస్తుందని పేర్కొన్నారు డీజీపీ సీవీ ఆనంద్. కాబట్టి సకాలంలో డేటాను నవీకరించడం , NCLను సమర్థవంతంగా అమలు చేయడం ప్రాధాన్యతగా కొనసాగాలని స్పష్టం చేశారు.


















