Minister Atchannaidu- Interesting Update : ఏపీలో ఎలాంటి యూరియా కొర‌త లేదు

ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు

Hello Telugu - Minister Atchannaidu- Interesting Update

Hello Telugu - Minister Atchannaidu- Interesting Update

Minister Atchannaidu : విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎలాంటి యూరియా కొర‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. రైతులంద‌రికీ స‌రిప‌డా యూరియా నిల్వ‌లు ఉన్నాయ‌ని తెలిపారు. కేంద్రం భారీ ఎత్తున యూరియాను ఏపీకి కేటాయించింద‌ని చెప్పారు. జ‌గ‌న్ రెడ్డి, ఆయ‌న ప‌రివారం చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. రైతులు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ని కోరారు. గురువారం జ‌రిగిన శాస‌న స‌భ‌లో ప‌లువురు ఎమ్మెల్యేలు యూరియా కొర‌త‌పై ప్ర‌శ్న‌లు సంధించారు. దీనికి స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు అచ్చెన్నాయుడు.

Minister Atchannaidu Key Comments on Urea

అన్ని సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు. ప్రతిపక్ష హోదా లేదనే నెపంతో మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాక పోవడం సరికాదన్నారు. యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకున్నామ‌ని చెప్పారు. యూరియా కొర‌త అన్న‌ది లేద‌న్నారు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నారు. ఇలాంటి నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మానుకోవాల‌ని సూచించారు . తప్పుడు ప్రచారాలు మానుకోవాలని కోరారు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchannaidu). కుంటిసాకులతో వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు రాక పోవడం ఎంతవరకు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

కేంద్ర ప్ర‌భుత్వంతో ఎప్ప‌టిక‌ప్పుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సంప్ర‌దింపులు జ‌రిపార‌ని , ఈ మేర‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింద‌ని తెలిపారు. ఈ మేర‌కు పెద్ద ఎత్తున యూరియాను కేటాయించింద‌న్నారు. త్వ‌ర‌లోనే ఆయా పోర్టుల‌కు యూరియా చేరుకుంటుంద‌ని చెప్పారు.

Also Read : CM Revanth Reddy – Tollywood Growth : టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకు వెళ్లాలి

Exit mobile version