TTD : తిరుమల : వైకుంఠ ఏకాదశి పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగా డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు టీటీడీ (TTD) ఈవో అనిల్ కుమార్ సింఘాల్. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శనం కల్పిస్తామన్నారు. దీంతో సామాన్య భక్తులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 15వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయించనున్నట్లు వెల్లడించారు ఈవో.
TTD Vaikuntha Dwara Darshan Updates
మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా కేటాయింపు ఉంటుందన్నారు అనిల్ కుమార్ సింఘాల్. కాగా నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తామన్నారు. డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయిస్తామని తెలిపారు . టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇస్తామన్నారు.జనవరి 6,7,8 తేదిల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5వేల టోకెన్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు అనిల్ కుమార్ సింఘాల్. ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. దళారులను ఎవరూ నమ్మవద్దని కోరారు.
Also Read : Trisha Shocking Comments : ఫోటో దిగినంత మాత్రాన పెళ్లి అయి పోయినట్లేనా..?
