Trisha Shocking Comments : ఫోటో దిగినంత మాత్రాన పెళ్లి అయి పోయిన‌ట్లేనా..?

తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన న‌టి త్రిష‌ కృష్ణ‌న్

Hello Telugu - Trisha Shocking Comments

Hello Telugu - Trisha Shocking Comments

Trisha : చెన్నై : ప్ర‌ముఖ న‌టి త్రిష‌ కృష్ణ‌న్ (Trisha) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న గురించి దుష్ప్ర‌చారం చేయ‌డం మంచి పద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. సినిమా రంగంలో ఎంతో మంది క‌లుస్తుంటార‌ని, ఆయా ఈవెంట్స్ ల‌లో హాజ‌రైన స‌మ‌యంలో సెల్ఫీలు, ఫోటోలు దిగ‌డం మామూలేన‌ని పేర్కొన్నారు. అలా అని ఫోటోలు దిగినంత మాత్రాన త‌న‌కు పెళ్లి అయి పోయిన‌ట్లు ప్ర‌చారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇంకా ఎంత మందితో పెళ్లి చేస్తారంటూ ప్ర‌శ్నిచారు. ఫొటో దిగితే పెళ్లి జరిగినట్టేనా అని నిల‌దీశారు. ఇది పూర్తిగా త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని, దాని గురించి ప‌దే ప‌దే ప్ర‌చారం చేయ‌డం, అబ‌ద్దాల‌ను వ్యాప్తి చేయ‌డం స‌బ‌బు కాద‌న్నారు న‌టి.

Trisha Slams

గత కొంతకాలంగా తన పెళ్లి, రాజకీయ రంగ ప్రవేశం గురించి వస్తున్న పుకార్లను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.స్నేహితులతో దిగిన ఫొటోలను వక్రీకరించి, అవాస్తవ కథనాలను జోడించి ప్రచారం చేయడంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఫోటోల‌ను ప‌ట్టుకుని వాటిని హైలెట్ చేయ‌డం, ఆపై పెళ్లి జ‌రిగిందంటూ వారే కామెంట్స్ చేయ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో శింబుతో ఇప్పుడు టీవీకే పార్టీ చీఫ్‌, న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ తో డేటింగ్ చేస్తోందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఆ మ‌ధ్య‌న ఈ ఇద్ద‌రు దిగిన ఫోటోలు క‌ల‌క‌లం రేపాయి. సోష‌ల్ మీడియాను షేక్ చేశాయి. ఇద్ద‌రూ క‌లిసి ఓ మూవీలో కూడా న‌టించారు.

Also Read : YS Sharmila Strong Demand : మొక్క‌జొన్న రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాలి

Exit mobile version