TTD : తిరుమల – శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామి వారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయ్యాయి. కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామి పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చింది.
TTD Updates
కాగా ఈ మరమ్మతు పనులు టీటీడీ జూలై 20 తేదిన ప్రారంభించిన విషయం విదితమే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగ భాగంలో పేరుకున్న ఇసుకను, పాచిని తొలగించారు. వాటర్‌వర్క్స్ విభాగంలోని దాదాపు 100 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగులు (పెయింటింగ్) అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మతు పనులు పూర్తి చేశారు.
అయితే స్వామి పుష్కరిణి మరమ్మతు పనుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పష్కరిణి హారతిని టీటీడీ నిలిపి వేసింది. అదే విధంగా భక్తులను కూడా ఒక నెల రోజుల పాటు స్వామి పుష్కరిణిలోనికి అనుమతించలేదు. ఆగస్టు 20 నుండి భక్తులను పుష్కరిణీలో స్నానం చేసేందుకు అనుమతించారు. ఇదిలా ఉండగా పుష్కరిణి అందుబాటులోకి రావడం పట్ల శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే సెప్టంబర్ 24 నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
Also Read : TTD EO Interesting Updates : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

















