TTD Simha Vahana Seva Interesting : నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్ప

సింహ వాహనంపై భ‌క్తుల‌కు స్వామి ద‌ర్శ‌నం

Hello Telugu - TTD Simha Vahana Seva Interesting

Hello Telugu - TTD Simha Vahana Seva Interesting

TTD : తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్ర‌వారం శ్రీ మలయప్పస్వామి సింహ‌ వాహనంపై యోగ న‌ర‌సింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది.

TTD Simha Vahana Seva

శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహ వాహ‌నాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమైంది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతం అవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు.

వాహ‌న సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయర్ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, టీటీడీ (TTD) ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌, ప‌లువురు బోర్డు స‌భ్యులు, సివిఎస్వో ముర‌ళి కృష్ణ‌ తదితరులు పాల్గొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి త‌ర‌లి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

Also Read : Vijayawada Kanaka Durga Interesting Update : శ్రీ మ‌హాలక్ష్మీ దేవిగా క‌నక‌దుర్గ‌మ్మ

Exit mobile version