TTD Top – Sacred Offerings : శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

యాగశాలలో హోమాలు, వైదిక కార్యక్రమాల నిర్వ‌హ‌ణ‌

Hello Telugu - TTD Top - Sacred Offerings

Hello Telugu - TTD Top - Sacred Offerings

TTD : తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల లో భాగంగా శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ స్వామి వారికి, వ‌కుళ మాత అమ్మ వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనుల వారికి, యోగ న‌ర‌సింహ స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహ స్వామి వారికి, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి పవిత్ర మాలలు సమర్పించారు.

TTD Updates

అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిచ్చారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వ‌హించారు. పవిత్రోత్సవాలు తిరుమలలో (TTD) 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీస్వామి వారి ఉత్సవ మూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికిగాను శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచడానికి ఉపయోగించే పెరటి భూమిలో పెంచడం విశేషం. పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం గానీ లేదా 200 మూరల నూలుదారం గానీ ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు.

ఈ కార్యక్రమంలో తిరుమల (TTD) శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో జె.శ్యామ‌ల‌రావు, ఆదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు, డెప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Also Read : Minister Nara Lokesh Promote : సీఐఐ భాగస్వామ్య సదస్సును విజయవంతం చేయాలి

Exit mobile version