TTD Chairman Fired on LV Subramanyam : ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యంపై టీటీడీ చైర్మ‌న్ ఫైర్

ఏఐ టెక్నాల‌జీపై అవ‌గాహ‌న లేకుంటే ఎలా

Hello Telugu - TTD Chairman Fired on LV Subramanyam

Hello Telugu - TTD Chairman Fired on LV Subramanyam

TTD Chairman : తిరుమ‌ల – తిరుమలలో దర్శన విషయంపై టీటీడీ మాజీ ఈవో ఎల్ వీ సుబ్ర‌మ‌ణ్యం చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు (TTD Chairman). వైకుంఠం క్యూ కాంప్లెక్సు లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలు దృష్టి లో పెట్టుకొని ఉచితంగా గూగుల్ , టిసిఎస్ లతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఆధునాత ఏఐ టెక్నాలజీ ఉపయోగించి 2 గంటలలోపు భక్తులకు దర్శనం కల్పించాలని టిటిడి పాలక మండలి నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. బుధ‌వారం బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ స‌మ‌యంలో గ‌తంలో ఈవోగా ప‌ని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీ పై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం భాధాకరం అన్నారు.

TTD Chairman Slams LV subramanyam

శ్రీవారిని‌ క్షణ కాలం పాటు దర్శించు కునేందుకు సామాన్య భక్తులు ఎదుర్కుంటున్న జాప్యాన్ని, ఇబ్బందులు తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ద్వారా సాధ్యమైనంత త్వరితగతిన భక్తులు స్వామి వారి దర్శనం పూర్తి చేసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ఇందులో భాగంగా ఏఐ సాంకేతికత సహకారం అందించేందుకు గూగుల్ /టిసిఎస్ తదితర ప్రముఖ సంస్థలు ప‌ని చేసేందుకు ముందుకు వ‌చ్చాయ‌న్నారు. ఈ తరుణంలో.భక్తుల్లో గందరగోళాన్ని సృష్టించేలా, ఒక సీనియర్ అధికారిగా పని చేసిన అనుభవం ఉన్న మీరు .తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు అన్నారు.

టీటీడీ దాతల సహాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృధా అని అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాన‌ని పేర్కొన్నారు బీఆర్ నాయుడు. భక్తులను గంటలు, రోజుల‌ తరబడి షెడ్లలో, కంపార్టమెంట్లలో బంధించి పడిగాపులు కాయడం మంచిదా…? భక్తుల ఇబ్బందులను తొలగించేందుకు ఏఐ ను తీసుకు రావాలని నిర్ణయించ‌డం త‌ప్పు ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తున్న తరుణంలో టీటీడీ కూడా ఏఐ టెక్నాలజీ వాడడంలో ఎలాంటి తప్పు లేద‌న్నారు. ఏఐ టెక్నాలజీకి స్వస్తి పలకమని మీరు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. పూర్తిగా ఖండిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Minister Bandi Sanjay Fired on Congress : కాంగ్రెస్ పాల‌న‌లో బీసీని ప్ర‌ధానిని చేశారా..?

Exit mobile version