Bhanu Prakash Reddy : తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల పుణ్యక్షేత్రంపై పదే పదే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy). ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు తిరుపతిలో. కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదని ఆయన హితవు పలికారు. కామెంట్స్ చేసే ముందు భక్తుల మనో భావాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలని అన్నారు భాను ప్రకాష్ రెడ్డి. ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఉద్దేశ పూర్వకంగా తప్పులు చూపడం సరైంది కాదన్నారు.
TTD Member Bhanu Prakash Reddy Slams Bhumana Karunakar Reddy
రంగనాయకుల మండపంలో జరగాల్సిన పరివట్టం వెంకయ్య చౌదరి ఇంటి వద్ద ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు భాను ప్రకాశ్ రెడ్డి. మీ హయాంలో స్వామి వారి శేష వస్త్రం ఎవరెవరికి చేరిందో, ఎలా బయటకు వెళ్లిందో త్వరలోనే లెక్కలు బయట పడతాయని హెచ్చరించారు. గత కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టను దిగ జార్చే విధంగా కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేస్తూ వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీటీడీ చైర్మన్ గా కొలువు తీరిన భూమన ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో, ఎంతగా పుణ్య క్షేత్రాన్ని భ్రష్టు పట్టించారో ప్రతి ఒక్కరికి తెలుసు అని అన్నారు. దీనిపై ప్రస్తుత టీటీడీ పాలకవర్గం విచారణకు ఆదేశించిందన్నారు. త్వరలోనే వాస్తవాలు వెలుగు చూస్తాయని పేర్కొన్నారు భాను ప్రకాష్ రెడ్డి.
Also Read : Indian Railways Important Update : రైల్వే ప్రయాణీకులకు ఖుష్ కబర్
