TTD : తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పండుగ వాతావరణం తరహాలో ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి (TTD) జేఈవో వి. వీరబ్రహ్మం స్పష్టం చేశారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా జేఈవో మాట్లాడారు. భక్తుల రద్దీని ముందస్తుగా అంచనా వేసుకుని అందుకు తగ్గట్లు వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శాఖల వారీగా అనుమతులు పెండింగ్ లో ఉంటే వెంటనే అప్రోవల్ తీసుకుని పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు జేఈవో. అమ్మ వారి గరుడ వాహన సేవ, గజ వాహన సేవ, పంచమి తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు.
TTD Padmavathi Brahmotsavams Update
భక్తుల రద్దీకి తగ్గట్లు అన్న ప్రసాదాలు, క్యూ లైన్లు, సెక్యూరిటీ, పద్మ సరోవరంకు ప్రవేశం, నిష్క్రమణ, మెడికల్, పారిశుద్ధ్యం పనులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తిరుమలలో విద్యుద్దీపాలంకారాలు, ఫలపుష్ప ప్రదర్శన ఏవిధముగా నైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదే రీతిలో తిరుచానూరులో ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ , గార్డెన్ విభాగాధికారులను ఆదేశించారు. తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాలు పారిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు ఏఈవో వీరబ్రహ్మం. నవంబర్ 16 అంకురార్పణ నుండి పంచమి తీర్థం వరకు అధికారులు రాజీపడకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
Also Read : YS Jagan Fired on AP Govt : జోగి రమేష్ అరెస్ట్ అక్రమం : జగన్ రెడ్డి
