YS Jagan Fired on AP Govt : జోగి ర‌మేష్ అరెస్ట్ అక్ర‌మం : జ‌గ‌న్ రెడ్డి

ఇదంతా బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్

Hello Telugu - YS Jagan Fired on AP Govt

Hello Telugu - YS Jagan Fired on AP Govt

YS Jagan : అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి (YS Jagan). ఆదివారం ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో క‌క్ష సాధింపు రాజ‌కీయాల‌కు తెర లేపారంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌మ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి ర‌మేష్ ను కావాల‌ని ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించు కోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ త‌మ‌ పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు అని పేర్కొన్నారు. జోగిరమేష్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని అన్నారు.

YS Jagan Shocking Comments on Jogi Ramesh Arrest

గత 18 నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారేన‌ని ఆ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్‌ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్‌ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని అని వాపోయారు జ‌గ‌న్ రెడ్డి.

నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదో వపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారని మండిప‌డ్డారు.

Also Read : Amazon Huge Layoffs in Hyd : హైద‌రాబాద్ లోని అమెజాన్ లో ఉద్యోగుల‌పై వేటు

Exit mobile version