TTD : తిరుమల : శ్రీవారి దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్న ప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారని చెప్పారు. భక్తులకు టిటిడి (TTD) అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.
TTD EO Key Comments
ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం ఎండ తీవ్రత, మధ్యాహ్నం మూడు సార్లు వర్షం పడిందన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా, వారి విజ్ఞప్తి మేరకు నాలుగు మాడ వీధిలోని గ్యాలరీలలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. త్వరలోనే ఏ ఒక్క భక్తుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని పేర్కొన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అంతే కాకుండా ఒక్క గరుడ వాహన సేవ రోజే స్వామి వారిని దర్శించుకునేందుకు ఏకంగా 3 లక్షల మందికి పైగా దర్శనం చేసుకున్నారని తెలిపారు ఈవో.
Also Read : Minister Nara Lokesh New Innovation : ఆటో డ్రైవర్ల కోసం ఉబర్ తరహా యాప్
