TTD Alarming – Mobiles Auction : శ్రీవారి భక్తులకై అందుబాటులోకి సెల్ ఫోన్లు..దక్కించుకోండి ఇలా!

పాక్షికంగా దెబ్బతిన్న ఫోన్లను ఈ కార్యక్రమంలో వేలం వేయనున్నారు...

Hello Telugu - TTD Alarming - Mobiles Auction

Hello Telugu - TTD Alarming - Mobiles Auction

TTD : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమర్పించబడిన మొబైల్ ఫోన్లను వేలం ద్వారా విక్రయించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేసింది. ఆగష్టు 4 నుంచి 5వ తేదీ వరకు ఈ వేలం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. భక్తుల ద్వారా స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన వాడిన, పాక్షికంగా దెబ్బతిన్న ఫోన్లను ఈ కార్యక్రమంలో వేలం వేయనున్నారు.

TTD Key Updates

ఈ వేలంలో మొత్తం 73 లాట్ల మొబైల్ ఫోన్లు పాల్గొననున్నాయి. వీటిలో కార్బన్, నోకియా, శాంసంగ్, ఒప్పో, మోటోరోలా, వన్‌ప్లస్, రెడ్‌మీ, లావా, టెక్నో, ఐటెల్, పానాసోనిక్, మైక్రోమాక్స్, ఫిలిప్స్, హువాయ్, ఇంఫినిక్స్, లెనోవో, జియోనీ, హెచ్‌టీసీ వంటి బ్రాండ్లు ఉన్నాయి.

ఈ వేలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ (https://konugolu.ap.gov.in) ద్వారా నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలి. బిడ్డింగ్ కోసం EA ID నంబర్లు: 25180, 25181, 25182, 25183గా టీటీడీ పేర్కొంది.

వివరాల కోసం:

వేలానికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలనుకునే వారు తిరుపతిలోని టీటీడీ కార్యాలయంలోని జనరల్ మేనేజర్ (వేలములు), లేదా AEVO (వేలములు) ను సంప్రదించవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: www.tirumala.org
ఫోన్ నంబర్: 0877–2264429

Also Read : TTD Chairman Br Naidu Alarming : శ‌స్త్ర చికిత్స‌ల స‌మ‌యం త‌గ్గించేందుకు చ‌ర్య‌లు

Exit mobile version