తమిళనాడు : ప్రముఖ నటి త్రిష కృష్ణన్ తన తల్లితో కలిసి గురువారం జరిగిన పోలింగ్ సందర్బంగా తన విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ, క్రీడా రంగానికి చెందిన వారు సైతం ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు వున్న విలువ గొప్పది. అది ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తాజాగా భారత దేశంలోని తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాట 234 నియోజకవర్గాలు, బెంగాల్ లో తొలి విడత 16 జిల్లాల్లో 156 నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతోంది. భారీ ఎత్తున పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, తన భార్యతో పాటు ఎంపీ కమల్ హాసన్ , కూతురు శ్రుతి హాసన్, వీటీవీ గణేష్, టీవీకే విజయ్ , రజనీకాంత్ , మణిరత్నం, సుహాసిని, ఖుష్బు సుందర్ , తదితరులు ఓటు వేశారు.
మరో వైపు ఎవరూ ఊహించని రీతిలో టీవీకే విజయ్ పార్టీ ఎక్కువగా యూత్ ఓటర్లను ప్రభావితం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వైపు ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా చెన్నైలోని కిల్పాక్‌లోని అన్నా నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నెం. 21లో తన ఓటు వేశారు. పౌర బాధ్యత ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. అందరూ వచ్చి ఓటు వేయండి, ఇది మన అత్యంత ముఖ్యమైన బాధ్యత అని స్పష్టం చేశారు. కోయంబత్తూరులో ఓటర్లకు విద్యార్థులు నిర్మించిన రోబో స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది.


















